మ్యాచ్ సమయంలో 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు

  • ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ పాటను ప్లే చేయడంపై సీఎస్కే అభ్యంతరం
  • పాటను ఉపయోగించే సమయం, సందర్భం సరికాదన్న సీఎస్కే
  • మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదన్న సీఎస్కే
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా తమను అవమానించారని ఆరోపిస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ సమయంలో స్టేడియంలో "దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ" అనే పాటను ప్లే చేయడంపై సీఎస్కే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ పాటను ఉపయోగించే సమయం, సందర్భం సరికాదని తన ఫిర్యాదులో పేర్కొంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. మ్యాచ్ సమయంలో "దోశ, ఇడ్లీ" అంటూ ఓ ట్రాక్‌ను డీజే ప్లే చేశారు. ఇది దక్షిణాది ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు, ఇక్కడి వారి సంస్కృతిని ఎగతాళి చేసేలా ఉందంటూ సీఎస్కే ఆందోళన వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేసింది. ఇలాంటి మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదని తమ ఫిర్యాదులో పేర్కొంది.

Chennai Super Kings
CSK
BCCI
Royal Challengers Bangalore
RCB
Chinnaswamy Stadium
IPL

More Telugu News